ఫ్రెష్, రెన్యువల్, ఉపకార వేతనానికై విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
2024 2025 విద్యా సంవత్సరములో జిల్లాలోని ప్రభుత్వ/ ప్రయివేట్ కళాశాలలో చదువుచున్న అర్హులైన బిసి,ఇబి.సి. విద్యార్థిని, విద్యార్థులు రెనివల్ మరియు ఫ్రెష్ ఉపకారవేతనముల కొరకు http://telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అబివృద్ధి అదికారి బుధవారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకొనుటకు తేది: 1-09-2024 నుండి 31-12-2024 వరకు అర్హులైన బిసి,  ఇబి.సి. విద్యార్థిని విద్యార్థులు ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవల్సిందిగా తెలియజేశారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యము వారు అర్హులైన విద్యార్థిని విద్యార్థులకు తెలిపిన వెబ్సైట్ నందు నిర్ణీత గడువులోగా ధరఖాస్తు చేసుకొనుటకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అట్టి దరఖాస్తులను వెంటనే సంబంధిత కార్యాలయంలో సమర్పించాలన్నారు.