నవతెలంగాణ – జన్నారం
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మారకద్రవ్యాలకు లోను కావద్దని జన్నారం ఎస్సై రాజ వర్ధన్ అన్నారు, బుధవారం మండలంలోని హాస్టల్ తండ లోని గిరిజన ఆశ్రమ పాఠశాల లో _యువతపై మాదక ద్రవ్యాల వాడకం వల్ల ఏర్పడే దుష్ఫలితాలు_ పై అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినిలు పాల్గొన్నారు.