– కీసర సీఐ వెంకటయ్య
నవతెలంగాణ-కీసర
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా జీవించాలని కీసర సీఐ వెంకటయ్య అన్నారు. మంగళవారం నాగారం మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సమాజానికి సవాల్ గా మారిన మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని సూచించారు. చదువుకోవాల్సిన సమయంలో మత్తుకు అలవాటు పడి ఎంతోమంది యువతీ యువకులు బానిసలు అవుతున్నారన్నారు. మత్తు మాయలో పడితే నేరుగా మృత్యు లోయలో పడ్డట్టేనన్నారు. ఇలాంటి మత్తు పదార్థాల జోలికి పోకుండా తగు జాగ్రత్తలతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు కీసర ఎస్సై నాగరాజు తదితరులు పాల్గొన్నారు.