
విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అవగాహన ఉండడమే కాకుండా వాటిలో పాల్గొని సమాజంలో చైతన్యవంతులుగా ఉండాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ముథోల్, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డి తో కలసి స్కూల్ ఆవరణలో “ప్రధమోత్సవ్” పేరుతో గురువారం రాత్రి నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు సాంప్రదాయబద్ధంగా వేదమంత్రాల మధ్య జ్యోతిప్రజ్వలన చేసి మరియు విద్యల తల్లి సరస్వతిమాత విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో కళల పట్ల ఆసక్తిని కనబర్చాలని వాటిలోని విషయాలను విశ్లేషణ చేయడమే కాకుండా సమగ్రంగా తెలుసుకొని వాటిని వివిధ సందర్భాలలో ఆకర్షింపజేసే విధంగా ప్రదర్శించాలని తెలుపుతూ ప్రతి విద్యార్థి తరగతి గదికే పరిమితం కాకుండా కళలు మరియు సాంస్కృతి కార్యక్రమాల పట్ల నైపుణ్యం కలిగి ఉండాలని తద్వారా సమాజంలో ఉత్తమ గుర్తింపుతో ఉంటామని చెప్పారు.ప్రత్యేకంగా విద్యార్థులు సంస్కృతి వైభవం పట్ల అధ్యయనం చేసి వాటిలోని విషయాలను అవలంభింపజేసి స్ఫూర్తి పొందాలన్నారు.కళ అంటే కేవలం నాట్యం, గానమే కాకుండా ఇతరులను సంతోషింపజేయడం, కఠినతరమైన విషయాలను సులువుగా నేర్చుకోవడం కళలో భాగమేనని చెప్పారు.డా.వి.నరేందర్ రెడ్డి అత్యుత్తమ విద్యావేత్త అని వారి సారధ్యంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అన్ని రకాలుగా ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ ఎటువంటి లోటు లేకుండా విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తూ తెలంగాణ రాష్ట్రం లోనే తలమానికంగా నిలవడం నరేందర్ రెడ్డి లాంటి విద్యావేత్త తెలంగాణ రాష్ట్రంలో ఉండడం తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి తగిన గుర్తింపు లభిస్తున్నదని చెప్పారు.విద్యాసంస్థల అధినేత డా. డా.వి. నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ పాఠశాలలో నేర్చుకున్న విషయాలు చాలా ప్రభావం చుపుతాయని మరియు ఉపాధ్యాయులు నిర్దేశించిన విషయాలను ఎప్పటికప్పుడు సాధనచేసి ఘనవిజయాల వైపు పయనించాలని సూచి చించారు. అదేవిధంగా జిల్లా అభివృధ్ధికై ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు చేయూతనిస్తాయని మరియు అభివృధ్ధికి సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.విద్యసంస్థల ఆరంభం నాటి నుండి ఉత్తమ ఫలితాలను సాధించడమే కాకుండా అత్యధిక సంఖ్యలో ఐ.ఐ.టి., యన్.ఐ.టి. మరియు మెడికల్ సీట్లను సాధిస్తున్నదని హర్షం వ్యక్తం చేస్తు జిల్లా విద్యారంగానికి తలమానికంగా నిలుస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు.వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి “రైతుల” కష్టాలను గురించి తెలుపుతూ , ” ఆర్మీ ”, “సేవ్ గర్ల్స్…. ” నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురు విద్యార్థులు ఆలపించినటువంటి గేయాలు మరియు నాటికలు అత్యంతం ఆకట్టుకున్నాయి. అదే విధంగా వార్షిక ప్రణాళికలో భాగంగా అద్భుతంగా రాణించిన వారికి బహునుతులను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.