నవ తెలంగాణ-ధర్మసాగర్
గంజాయి మత్తు పదార్థాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండీ,సైబర్ గేములు పట్ల సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక సీఐ ఏ ప్రవీణ్ కుమార్ సోమవారం ముప్పారం గ్రామంలోని కస్తూరిబా పాఠశాల నందు విద్యార్థులతో ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ సైబర్ క్రైమ్స్ అవగాహన, మహిళా భద్రత, 100 డైల్ గురించి మరియు గంజాయి లాంటి మత్తుమందుల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ముందుకు సాగాలన్నారు.
కుంగ్ ఫూ లో ప్రతిభ కనబరిచిన సెయింట్ ఆంటోనీ హైస్కూల్ విద్యార్థులను అభినందించిన సీఐ.
న్యూ పారడైజ్ ఫంక్షన్ హాల్ కాజీపేట్ నగరంలో శనివారం నిర్వహించిన 9వ నేషనల్ లెవెల్ ఓపెన్ టు ఆల్ మార్షల్ ఆర్ట్ కరాటే ఛాంపియన్షిప్. పోటీల్లో స్థానిక ధర్మసాగర్ సెయింట్ అంతోని హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.అత్యుత్తమ ప్రతిభ కనబరచి. అండర్ 14 స్పారింగ్ విభాగంలో ఆర్ సందీప్, కౌశిక్ గోల్డ్ మెడల్ సాధించారు. జి ఈశ్వర్ అభినవ్ సిల్వర్ మెడల్ సాధించారు.సుమిత్ బ్రాంన్ మెడల్ సాధించడంతో వారిని ప్రత్యేక అభినందించారు. అనంతరం సెయింట్ అంతోని హైస్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కోచ్ దామెర మేరి నీ స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ ఎలిజబెత్ రాణి లను అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సై జాని పాష,సిస్టర్స్ రాజమణి,సిస్టర్ ఫాతిమా రాణి,ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు పాల్గొనడం జరిగింది.