విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

Students should be aware of the lawsనవతెలంగాణ – తాంసి
విద్యార్ధి దశనుండే చెట్టలపై అవగాహన కలిగి ఉండాలి అని చీప్ లీగల్ ఏయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ దాసరి గంగారాం విద్యార్థులకు సూచించారు. శుక్రవారం రోజున మండల కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవదికార సంస్థ అధ్వర్యంలో విద్యార్థులకు చెట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మొదటగా జ్యోతి ప్రజ్వల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే చెట్టలపై అవగాహన కలిగి ఉండాలి. తమ కుటుంబ సభ్యులు వ్యవసాయం చేసినట్లుగా ఉంటే  సీడ్స్ పెస్టిసైడ్ కొనేటప్పుడు బిల్ తీసుకోవాలి నకిలీ విత్తనాలు ఎరువులు వల్ల నష్టం జరుగుత కంపెనీపై  దుకాణాలపై కంజుమర్ ఫోరంలో కేసు వేయవచ్చు వ్యవసాయ కూలీలు ఇన్సూరెన్స్ చేసుకోవాలి లేబర్ ఆఫీసులో సభ్యత్వం కలిగి ఉండాలి. తమ కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. విద్యార్థులు చెట్టాలపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం డ్రక్స్ కు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. కేసుల్లో ఇరుకుంటే ఏటువంటి ఉద్యోగానికి పనికి రారు నిరుపేద ఐనా వారు కేసుల్లో ఉంటే డిస్టీక్ లీగల్ అథారిటీ అడ్వకేట్ ఉచితంగా మీ కేసులు వాదిస్తారు పిల్లలు ఫోన్లు వాడవద్దు అపరిచిత వ్యక్తులు మిపట్ల అనుచితంగా వ్యవహరించిన వెంటనే పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలి అన్నారు. అనంతరం కార్గిల్ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ అరుగుల అశోక్,అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ డోలే. ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్, తాహాసిల్దార్ లక్ష్మి, ఏ ఎస్సై స్వామి, పాఠశాల సిబ్బంది ఉన్నారు.