
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులు అవగాహన ఉండాలని ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ జి.శంకర్ రాజు అన్నారు. బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇని స్టిట్యూట్ ఆధ్వర్యంలో మంగళవారం అబిడ్స్ లోని సెయింట్ జార్జ్ డిగ్రీ పీజీ కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎసిపి శంకర్ రాజు మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్న వయసులో డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేయడం సరికాదన్నారు. మైనర్ డ్రైవింగ్, స్టాప్ లైన్, రాంగ్ రూట్, ట్రైబల్ రైడింగ్, ఫోన్ డ్రైవింగ్, జీబ్రా క్రాసింగ్ వాటిపై. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. చిన్న వయసు నుంచే క్రమశిక్షణ, ఏకగ్రత, సమయం వృధా కాకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అబిడ్స్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రవికుమార్. కళాశాల ప్రిన్సిపల్ జిఎస్ అధ్యాపకురాలు సురేఖ. టి టి ఐ బేగంపేట్ సిబ్బంది. ట్రాఫిక్ పోలీసులు 150 మంది విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.