మహిళా రక్షణ చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి: సిఐ ఎర్రల్ల కిరణ్ 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
మహిళలు విద్యార్థులు మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని హుస్నాబాద్ సిఐ ఎర్రల్ల కిరణ్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని సివి రామన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు  బాలికలకు, మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, సైబర్ నేరాలు, గుడ్ టచ్ బాడ్ టచ్, తదితర అంశాల పై హుస్నాబాద్ సీఐ కిరణ్ అవగాహన కల్పించారు. ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్  100,, సిద్దిపేట షిటీమ్ వాట్సప్ నెంబర్ 8712667434, మహిళా పోలీస్ స్టేషన్ సిద్దిపేట 8712667435 నెంబర్లకు  ఫోన్ చేసి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్  నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.