విద్యార్థులు ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలి: డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ విద్య

నవతెలంగాణ – బాన్సువాడ(నసురుల్లాబాద్)
విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని కామారెడ్డి జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ ఓ విద్య  సూచించారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో వైద్య, ఆరోగ్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ విద్య పరిశీలించి, విద్యార్థుల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ విద్య మాట్లాడుతూ.. విద్యార్థులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, ఆరోగ్యంగా ఉండాలని అవగాహన కల్పించారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని, శారీరకంగా ఆరోగ్యంతో ఉండాలని సూచించారు. విద్యార్థు లకు వచ్చే సంక్రమిత, అసంక్రమిత వ్యాధులతో పాటు, సీజనల్‌ వ్యాధుల పట్లతగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బయటి తినుబండరాలకు దూరంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లా  కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, వసతిగృహాలు, కస్తూర్భాగాంధీ పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి, వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్, దివ్య. సి హెచ్ ఓ, దయానంద్, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, పాల్గొన్నారు.