విద్యార్థులు మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి: తొగుట సిఐ ఎస్కే లతీఫ్

Students should be vigilant about drugs: Thoguta CI SK Latifనవతెలంగాణ – తొగుట
గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని తొగుట సిఐ ఎస్కే లతీఫ్, ఎస్ఐ రవికాంత్ రావు సూచించారు. బుధవారం మండలంలోని రాంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థు లకు సైబర్ నేరాలు, గంజాయి ఇతర మత్తు పదా ర్థాలపై అవగాహన కల్పించారు. ఒకసారి మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం అల్లకల్లోలం అవుతుందని తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలో ఎవరైనా గంజాయి అమ్మినట్లు, సేవిస్తున్నట్లు మీకు తెలిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు ఇతర వివరాలు గుర్తు తెలియని వ్యక్తుల కు తెలుపొద్దని హెచ్చరించారు. మానవ తప్పిదం వల్ల సైబర్ నేరాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుత టెక్నాలజీని మంచికి మాత్రమే ఉపయోగిం చుకోవాలన్నారు. చదువుకునే సమయంలో ఎలాం టి చెడు ఆలోచనలకు తావివ్వకుండా, ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్ద ని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు పెట్టుకొని ఇష్ట పడి చదువుకోవాలన్నారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉంటూ సైబర్ నేరస్తులు పంపే ఏ లింకులు ఓపెన్ చేయొద్దని హితవు పలికారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.