విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

నవతెలంగాణ-చౌటుప్పల్‌
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మున్సిపల్‌ చైర్మెన్‌ వెన్‌రెడ్డి రాజు అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి 10/10 జీపీఏ సాధించిన సిలివేరు శ్వేత, ఊదరి గౌతమ్‌లకు పదివేల రూపాయల చొప్పున బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బండమీది మల్లేశం, ఆలె నాగరాజు, ప్రధానోపాధ్యాయులు కోమటిరెడ్డి మాధవరెడ్డి, స్కూల్‌ వైస్‌ చైర్మెన్‌ సుక్క సుదర్శన్‌, కటిక వెంకటేశ్‌, జంపాల యాదగిరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.