విద్యార్థులు చదువుల్లో రానించి తల్లి దండ్రుల కలలు నెరవవేర్చాలి…

నవతెలంగాణ -పెద్దవూర
విద్యార్థులు చదువుల్లో రానించి తల్లి దండ్రుల కలలు నెరవేర్చాలని వెల్మగూడెం జెడ్పిహెచ్ ఎస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీదేళ్ళ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పాఠశాల లో గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాచిరెడ్డి లక్ష్మారెడ్డీ పదవ తరగతి విద్యార్థులకు సొంత ఖర్చులతో వితరణ చేసిన స్టడీ చైర్లను పంపిణి చేసి మాట్లాడారు.దాతల సహాయం మరువలేనిదని ముందుకు వచ్చి 16 వేల రూపాయల సొంత ఖర్చులతో విద్యార్థులకు స్టడీ చైర్లు అందిచడం అభినందనీయమని వారి సేవలను కొనియాడారు.విద్యార్థులు పట్టుదలతో క్రమశిక్షణతో అనుకున్నది సాధించాలని అన్నారు. విద్యార్థులు చదువుల్లో సక్సెస్ కావాలంటే ఆలోచనలు మంచిగా ఉండాలని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని విద్యార్థులు యోతదితరులు పాల్గొన్నారు.గావాకింగ్ సూర్య నమస్కారం, చేసుకొని ఫిట్నెస్ గా ఉంటే చక్కని పౌష్టికాహారం కూడా తీసుకొని దృఢంగా ఉంటే మన ఆలోచనలు స్థిరంగా ఉంటాయని అన్నారు. స్టడీ చైర్లు వితరణ దాత లక్ష్మారెడ్డీ మాట్లాడుతూనేటి యువత ముఖ్యంగా చెడు వ్యసనాలకు లోను కాకుండా తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని సూచించారు. అనంతరం లక్ష్మారెడ్డిని పాఠశాల ఉపాధ్యాయులు ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమం లో ఇంచార్జి వసంతకుమార్, గవ్వ హిమవంత్ రెడ్డీ, రామకృష్ణా రెడ్డీ, రామాంజి రెడ్డీ,సమతా, శకుంతల, వెంకటయ్య, లేనిని బాబు, విద్యర్థినీ, విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.