విద్యార్థులు సైన్స్ పట్ల అభిరుచిని అలవర్చుకోవాలి

– మండల విద్యాశాఖ అధికారి రామారావు
నవతెలంగాణ –  అచ్చంపే
విద్యార్థులు సైన్స్ పట్ల అభిరుచి అలమరుచుకోవాలని మండల విద్యాధికారి రామారావు సూచించారు.  ఫిబ్రవరి 28.న జాతీయ సైన్స్ దినోత్సవం  సందర్భంగా,  ప్రభుత్వ ఆదేశానుసారంగా  బుధవారం పట్టణంలోని  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి రామారావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సైన్స్ ద్వారా  విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, సమాజాన్ని అభివృద్ధి లో ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత విద్యార్థుల పైన ఉన్నదని, సమాజంలో మూఢనమ్మకాలను పారద్రోలాలని వారు విద్యార్థులకు సూచించారు , మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు జిల్లా స్థాయిలో ఈనెల 23న పాల్గొనవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గోపాల్ సైన్స్  ఉపాధ్యాయులు స్వామీలాల్, శంకర్ , సరస్వతి, షాహిని భేగం పాల్గొన్నారు.