విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

– మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతిరెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్‌
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక సీసీరెడ్డి పాఠశాలలో బాస్కెట్‌బాల్‌ క్లబ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఓపెన్‌ టు ఆల్‌ బాస్కెట్‌బాల్‌ పోటీలను ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి ఉన్నత విద్యా, ఉద్యోగాల్లో క్రీడకోటాలో రిజర్వేషన్స్‌తో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు.క్రీడలతో ఐక్యత, స్నేహభావం కలుగు తుందన్నారు.క్రీడాకారులను, క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకు ఎల్లవేళలా తన వంతు సహాయసహకారాలు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ కందుల కోటేశ్వరరావు,కౌన్సిలర్లు షాబుద్దీన్‌, కర్రి సుబ్బారావు, నాయకులు కంబాలప్రసాద్‌, బాబా, క్లబ్‌ అధ్యక్షులు లాందేవరాజ్‌, సెక్రెటరీ అర్జున్‌, ఆర్గ నైజింగ్‌ కమిటీ సభ్యులు వినయ్‌,సాయి, ప్రభాస్‌, విజరు, హేమంత్‌ సాయి తదితరులు పాల్గొన్నారు.