విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

– ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిలు

నవతెలంగాణ- నెల్లికుదురు
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిలు అన్నారు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సుమారు 30 రకాల క్రీడలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సుమారు 30 రకాల క్రీడలను నిర్వహించామని వారికి బహుమతులను ప్రధానం చేసేందుకు సుమారు ఐదువేల రూపాయలు విలువ చేసి బహుమతులను మండల కేంద్రానికి చెందిన శీలం భారతమ్మ లక్ష్మయ్య జ్ఞాపకార్ధంగా శీలం సోమన్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ప్లేట్లు టిఫిన్ బాక్సులు గ్లాసులు వివిధ రకాలైన ప్రైస్లను తీసుకొచ్చి వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు అందించాలని అన్నారు. ఈ పాఠశాలకు సుమారు ఐదువేల రూపాయలు అందించిన శీలం సోమన్నకు పాఠశాల ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేసేందుకు కొంతమంది ముందుకు రావాలని అన్నారు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులకు అన్ని రకాల వసతులు ఉన్నాయని అన్నారు అనంతరం శీలం సోమన్నకు శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మణ్ చంద్రశేఖర్ పుష్ప లీల శ్రీవాణి తో పాటు భక్కి రెడ్డి ఉపాధ్యాయులు ఉన్నారు.