– జస్టిస్ గోపాల్ రెడ్డి
నవతెలంగాణ-ఆదిబట్ల
సాంకేతిక విద్యారంగంలో విద్యార్థులు దేశానికి ఉప యోగ పడేలా ఎదగాలని తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ ఫీ రెగ్యులేటరీ కమిటీ చైర్మెన్ జస్టిస్ ఎ.గోపాల్ రెడ్డి అన్నారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళా శాలలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అయన మాట్లాడుతూ.. సాంకే తిక విద్యారంగంలో 4 ఏండ్లు బీటెక్ పూర్తి అయినా వెంట నే యువతకు ఉద్యోగాలు దొరకడం సంతోషం కలిగించే విషయమన్నారు. కానీ అంతటితో ఆగకుండా కొత్త విష యాలు నేర్చుకొని కళాశాలకు ఉపాధ్యాయులకు పేరు ప్ర ఖ్యాతులు తీసుకురావాలన్నారు. అనంతరం డాక్టర్ ప్రకా ష్ చౌహన్ మాట్లాడుతూ..సివిల్, సీఎస్‌ఈ, ఈఈఈ వంటి వివిధ కోర్స్‌లలో తరగతి గదులలో నేర్చు కున్న దా నితో ఆగిపోకుండా సమాజంలోని పరిస్థితులకు అనుగు ణంగా కొత్త అంశాలు నేర్చుకోని తమను తాము తీర్చిదిద్దు కోవాన్నారు. అనంతరం సీవీఆర్ కళాశాల చైర్మె న్ డాక్టర్ వెంకట రాఘవ చెర బుడ్డి ఆధ్వర్యంలో ఎంటెక్, బీటెక్‌లో అత్యుత్తమ మార్కులు సాధించి కళాశాలకు పేరు, ప్రఖ్యా తులు తెచ్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్‌తో పాటు నగ దు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కె రామశాస్త్రి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె రా మ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ లక్కం శివారెడ్డి, డీన్-అకాడమీక్స్ డాక్టర్ నాయన తార, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, వివిధ విభాగల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.