విద్యార్థులు సైన్స్ పై అవగాహన పెంచుకోవాలి

Students should increase their awareness of scienceనవతెలంగాణ – రాయపర్తి
విద్యార్థులు బయోలాజికల్ సైన్స్ పై అవగాహన పెంచుకోవాలని బయోలాజికల్ సైన్స్ ఫోరం సమన్వయకర్త రావుల భాస్కర్ రావు అన్నారు. సోమవారం తెలంగాణ బయోలాజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులను సృజనాత్మక శక్తిని పెంపొందించుటకు ఇలాంటి టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థి దశ నుండే బయోలాజికల్ సైన్స్ పట్ల అవగాహన ఉంటే ఆరోగ్యవంతమైన జీవనానికి కొనసాగించవచ్చన్నారు. సైన్స్ టాలెంట్ టెస్టులను జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. నివహించిన సైన్స్ టాలెంట్ టెస్ట్ లో మండల స్థాయిలో సాయి వర్ధన్, వర్షిత్ రెడ్డి, తెలుగు మీడియంలో రామ్ చరణ్, వినయ్ కుమార్ ఎంపికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామిరెడ్డి, నాగార్జున, నరేందర్, రాధా, సుధాకరాచారి, పద్మశ్రీ, రమేష్, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు