ఆధునిక టెక్నాలజీతో విద్యార్థులు ముందుకు సాగాలి 

Students should keep pace with modern technology– రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క 
నవతెలంగాణ – గోవిందరావుపేట 
ప్రభుత్వం అందిస్తున్న ఆధ్యాత్మిక టెక్నాలజీతో విద్యార్థులు ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం  మండలం లోని చల్వాయి  ఆదర్శ పాఠశాల లో కంప్యూటర్ ల్యాబ్, (సి ఎస్ ఆర్ నిధులు మౌరిటెక్ ఐటి సంస్థ సౌజన్యం)  10 కంప్యూటర్లతో  జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంథాలయ చైర్మన్ రవి చందర్ లతొ కలసి  రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క  ప్రారంభించారు. ఈ సందర్భంగా శీతక్క మాట్లాడుతూ ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందిందని అందుకు తగ్గట్టుగా విద్యార్థులకు ప్రభుత్వం చేయూతను అందిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార యంత్రాంగం మరియు మండల అధికార యంత్రాంగం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.