
విద్యార్థులు ప్రతిరోజు వ్యక్తిగత పరిశుభ్రత తప్పకుండా పాటించాలని హుస్నాబాద్ ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి అన్నారు గురువారం హుస్నాబాద్ మండలంలోని నాగారం గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని వార్డులలో నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్, క్లోరినేషన్ చేశారు. ఆల్ఫా సైఫార్మెట్రిన్ ద్రావణంతో దోమల లా ర్వాలను అరికట్టుట కోసం దోమల మందు పిచికారి చేపట్టారు. పాఠశాలలో విద్యార్థులకు సీజనల్ వ్యాధులైన మలేరియా డెంగు చికెన్ గునియా పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పంచాయతీ సెక్రెటరీ రాజమణి , అంగన్వాడి టీచర్లు ఆశా కార్యకర్తలు హెల్త్ అసిస్టెంట్ రవీందర్ రెడ్డి, ఏఎన్ఎం పద్మ ,ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.