నవతెలంగాణ – కామారెడ్డి
రోడ్డు మీద నడిచే పాదాచారులు, విద్యార్థులు వాహనాల రాకపోకలు గమనించి అప్రమత్తంగా వ్యవహారించాలి అని, ప్రతి విద్యార్థి తమ కుటుంబ సభ్యులకి హెల్మెట్ నీ ధరించటం వళ్ల అరికట్ట కలిగే ప్రమాదలగురించి చైతన్య పరచాలి అని జిల్లా రవాణా శాఖ అధికారి కె. శ్రీనివాస రెడ్డి విద్యార్థులని ఉద్దేశించి రాజంపేట మండలంలోని బసనపల్లి గ్రామంలో గల యస్. పి. ఆర్. కె పాఠశాల లో రోడ్డు భద్రత మాసోత్సవలలో భాగంగా ప్రసంగించారు. ఈ
కార్యక్రమ నిర్వహణకి సహాయ సహకారాలు అందించిన పాఠశాల యాజమాన్యంకి , సిబ్బందికి అభినందనలు తెలిపారు. వేరొక కార్యక్రమం లొ భాగంగా మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ అఫ్రోజుద్దీన్, మహేష్ లు భీక్నూర్ టోల్ గేట్ వద్ద వాహనాలకి రిఫ్లెక్టీవ్ రేడియం స్టికర్స్ ప్రాధాన్యత వివరించారు. పలు వాహనాలకి రోడ్డు భద్రత ప్రాధాన్యత ప్రచార పత్రాలను వారి అంగీకారంతో వాహనాలకి అతికించారు.