మత్తు పదార్థాలను తరమి కొట్టడంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి..

Students should participate in driving away drugs.– దైర్యంగా మహిళలు,యువతులు ముందుకు వస్తేనే వేధింపుల నుండి బయటపడగలరు..
వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి..
నవతెలంగాణ – వేములవాడ 
నిషేధిత మతుపదార్థాలను తరమి కొట్టడంలో ప్రతి విద్యార్థులు భాగస్వామ్యం కావాలి.. దైర్యంగా మహిళలు,యువతులు ముందుకు వస్తేనే వేధింపుల నుండి బయటపడగలరు అని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పి శేషాద్రి రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణ పరిధిలోని స్థానిక ఫంక్షన్ హాల్ లో మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు, మహిళ రక్షణ, చట్టాలపై విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించి సే నో టో డ్రగ్స్  కి సంబంధించిన పోస్టర్స్ ని ఆవిష్కరించిన వేములవాడ ఏఎస్పీ యవత విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత లక్షలను సాధించాలన్నారు. మత్తు పదార్థాలకు మానసిసంగా బానిస కావడం ద్వారా అనుకోకుండా నేరాలు చేసే అవకాశం ఉంటుందని, యువత విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలను తరిమికొట్టడంలో భాగస్వామ్యం కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి గురించిన సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గాని, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్  87126 56392 లేదా  డయల్ -100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు.
మాధకద్రవ్యాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని అందులో భాగంగా జిల్లాలోవిద్యార్థులు,ఉపాధ్యాయుల భాగస్వామ్యం తో యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పటు చేసి జిల్లాలోని అన్ని పాఠశాలలో, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మహిళలు,విద్యార్థినులు వేధింపుల నుండి బయట పడేందుకు దైర్యంగా ముందుకు వెళ్ళడమే మార్గామని,విద్యార్థినిలు పోకిరీల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వేదింపులకు సంబందించి ఏదైనా చిన్న సంఘటన జరిగిన వెంటనే ఇంట్లో తల్లిదండ్రులకు గానీ, టీచర్స్ కు గానీ తెలియజేయాలని, ఎవరైనా తమ పట్ల చిన్న తప్పు చేసేందుకు ప్రయత్నిస్తున్న ముందుగానే గుర్తించి అలాంటి వారిని  దూరంగా ఉంచాలన్నారు.జిల్లాలో మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్ విద్యా సంస్థలు, బస్టాండ్ లు, మహిళలు పని చేసే ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో డ్రెస్ లలో  నిరంతరం పోకిరీలపై నిఘా ఉంచుతూ మహిళా చట్టాలపై వివిధ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఎవరైనా వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో  అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425  కు పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్ డిఎస్పీ ఉపేందర్, సి.ఐ వీరప్రసాద్, ప్రిన్సిపాల్ వేణు గోపాల్,ఎస్ ఐ అంజయ్య, షీ టీం ఏ. ఎస్.ఐ ప్రమీల,షీ టీమ్ సిబ్బంది, విద్యార్థులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.