
నవతెలంగాణ డిచ్ పల్లి
విద్యార్థులంతా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మంచిగా నేర్చుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి అన్నారు. గురువారం తెలంగాణ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్ లో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులంతా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మంచిగా నేర్చుకొని మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు.ప్రస్తుత కాంపిటీటివ్ వరల్డ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ కి చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. విద్యార్థులంతా ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలన్నారు.ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ను అయన అభినందించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ అరతి పాల్గొని ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పై మాట్లాడారు. అలాగే విద్యార్థులంతా కమ్యూనికేషన్ స్కిల్స్ ఆక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొని స్కిల్స్ నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వామి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనే అంశంపై విద్యార్థులకు సెమినార్ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఈవెంట్ మేనేజర్లుగా బి.శివ ,సాయి కుమార్,సతీష్, శ్రీకాంత్ వ్యవహరించాగా, ఈవెంట్ మెంటర్ గా బిజినెస్ మేనేజ్మెంట్ హెచ్వోడి ప్రొఫెసర్ ఆంజనేయులు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో బిజినెస్ మేనేజ్మెంట్ డీన్ ప్రొఫెసర్ కైసర్ మహమ్మద్,కామర్స్ డిపార్ట్మెంట్ హెచ్వోడి ప్రొఫెసర్ రాంబాబు, ప్రొఫెసర్ అపర్ణ,ప్రొఫెసర్ వాణి, వివిధ డిపార్ట్మెంట్ల విద్యార్థులు పాల్గొన్నారు.