నవతెలంగాణ – ఆర్మూర్
కష్టపడి చదువుకుంటూ విద్యార్థి స్థాయి నుంచే తమ లక్ష్యాన్ని నిర్దోషించుకొని ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి అన్నారు. పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాలులో శనివారం చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్టు నిర్వహించిన విద్యాస్ఫూర్తి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ చిన్ననాటి నుండి శ్రద్ధగా చదువుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు.. విద్యార్థులు ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిసకు గురైతే విలువైన జీవితాలను నాశనం చేసుకున్న వారు అవుతారని, విద్యార్థులు ముఖ్యంగా సెల్ఫోన్ లకు దూరంగా ఉండాలని అన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ పతి ఒక్కరు చదువుతోనే ఉన్నత స్థాయికి ఎదుగుతారని, చదువుతో పాటు సమాజ సేవ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాణించిన 13 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహంతో పాటు మోడల్స్ను అందజేసినారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి రాజా గౌడ్ ,,ఏ సి పి బస్వా రెడ్డి, తహసిల్దార్ గజానను, మున్సిపల్ కమిషనర్ రాజు ఎంఈఓ రాజ గంగారం, ఎంపీడీవో సాయిరాం , పాఠశాల హెడ్మాస్టర్ లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు.