– పదో తరగతి భవిష్యత్‌కు పునాది
– జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ మంత్రి హరీశ్‌రావ్
నవ తెలంగాణ-సిద్దిపేట
సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులు మేధస్సుకు పదును పెట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిద్దిపేట గర్ల్స్ హైస్కూల్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని పదవ తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లా డుతూ.. డిజిటల్ కంటెంట్ బుక్స్ మన బాలికల ఉన్నత పాఠశాలలో ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్పొరేట్ స్కూల్‌ను తలపించేలా పాఠశాలను తీర్చిదిద్దుకున్నామని, అద్భుత మైన గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నా మన్నారు. పదో తరగతి విద్యార్థులకు కేసీఆర్ డిజిటల్ కంటెంట్, టీహెచ్‌ఆర్ బహుమతిని అడ్వాన్స్‌గా అందజేస్తు న్నానని తెలిపారు. బాగా చదివి అత్యధిక మార్కులు సాధించాలని, అప్పుడే మీకు ఇచ్చిన ఈ గిఫ్ట్‌కు ఫలితం, సార్థకత ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సిద్దిపేట అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని, అదే స్ఫూర్తితో విద్యారంగంలో ఆదర్శంగా నిలిచింద న్నారు. ఈ ఏడాది నియోజకవర్గంలో 2516 మందికి ఈ బుక్స్ పంపిణీ చేస్తున్నామన్నారు. క్యూ ఆర్ కోడ్‌ను మీ ఇంట్లో మీ అమ్మ, నాన్న ఆన్ రైడ్ ఫోన్‌లో స్కాన్ చేస్తే వేంటనే ఆ సబ్జెక్ట్ అంశంపై టీచర్ బోర్డుపైన 3డి రూపంలో క్లాస్ చెబుతారని చెప్పారు. మీ అమ్మ నాన్నలకు ఉత్తరం రాశానని, వారికి ఫోన్ చేసి మీరు ఎలా చదువుతున్నారని అడుగు తానన్నారు. పదో తరగతి భవిష్యత్‌కు గొప్ప పునాది అని తెలిపారు. రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గాన్ని100 శాతం ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలపాలన్నదే తన తాపత్రయమన్నారు.