విద్యార్థులు ఉన్నత లక్ష్యాల కోసం కృషి చేయాలి

– భీంగల్ సిఐ నవీన్ కుమార్ 
– శ్రీ భాషితలో సందడిగా వెల్కమ్ పార్టీ 
నవతెలంగాణ కమ్మర్ పల్లి 
విద్యార్థులు ఉన్నత లక్ష్యాల  కోసం కృషి చేయాలని భీంగల్  సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నవీన్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పద్మశాలి విజయ సంఘం కళ్యాణ మండపంలో స్థానిక  శ్రీ భాషిత జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సర విద్యార్థులు మొదటి సంవత్సర విద్యార్థులకు వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐ నవీన్  కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్మీడియట్ అనేది మెయిన్ స్టేజ్ అన్నారు. ఇంటర్మీడియట్ దాటిన వ్యక్తి వార్షిక పరీక్షలు, కాంపిటీటివ్ పరీక్షల్లో పాల్గొని జాబ్ సంపాదించడానికి ప్రధాన భూమిక ఇంటర్ విద్య అని పేర్కొన్నారు. దీన్ని పూర్తి చేసి విద్యార్థులు ఉన్నత లక్ష్యాల  కోసం కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాల కోసం కష్టపడి మార్చిలో జరిగే వార్షిక పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. విద్యార్థులు ఆటపాటలతో హోరెత్తించారు. కార్యక్రమంలో  కళాశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ రాజశేఖర్, డైరెక్టర్లు సుంకేట  రవి, సిలివెరి సంజీవ్, మలావత్ సంతోష్, లెక్చరర్లు హన్మాండ్లు, సుమన్, సాయన్న, శ్రీనివాస్, గజానంద్, శ్రీధర్, రంజిత్, రాజేష్, శృతి, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.