విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి

నవతెలంగాణ- హలియా
రానున్న పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు కష్టపడి చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి అన్నారు.  మంగళవారం ఆయన అనుముల మండలంలోని జిల్లా  హాలియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల కొత్తపల్లి సందర్శించి తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధనను పరిశీలిచారు  పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచి మంచి ఫలితాలు రాబట్టాలని కోరారు. ఉదయం, సాయంత్రం పూట వేళలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులకు ఉపాధ్యాయులు తప్పకుండా హాజరుకావాలని అన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపాధ్యాయులపై చర్యలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది. వీరి వెంట మండల విద్యాధికారి లావూరి బాలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండా కృష్ణమూర్తి ,విజయలక్ష్మి, సునీత తదితరులు ఉన్నారు.