విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి విష్ణు
–  ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ పాడ్స్ అందచేత
నవతెలంగాణ – జమ్మికుంట
విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి  ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్దునురి విష్ణు  అన్నారు. శనివారం  జమ్మికుంట పట్టణం లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల లో ఆ పాఠశాల ప్రిన్సిపల్ సుప్రియ అధ్యక్షతన  విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్ అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో, చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంజిత్ , నిరంజన్ , సునీల్ తదితరులు ఉన్నారు