– ఉపాధ్యాయురాలు ఎండి నాగు మీరా సహకారంతో విద్యార్థులకు గ్లాసులు
– విద్యార్థుల తల్లులకు చీరలు అందజేత
– రికార్డులను భద్రపరచుకొనేందుకు ఒక బీరువా అందించడం పట్ల గ్రామస్తులు హర్ష వ్యక్తం
– ఎంపీ యుపిఎస్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హెచ్ నరేంద్ర కుమార్
నవతెలంగాణ – నెల్లికుదురు
ఎంపీయూపీఎస్ పార్వతమ్మ గూడెం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హెచ్ నరేంద్ర కుమార్ ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు మహమ్మద్ నాగు మీరా అన్నారు గురువారం పార్వతమ్మ గూడెం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్టీల్ గ్లాసులు వారి తల్లులకు 62 మంది మహిళలకు చీరలను మరియు ఆ పాఠశాల కు ఒక బీరువా ను ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు మహమ్మద్ నాగు మీరా సయ్యద్ అబ్బాస్ దాత సహకారంతో అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటగా ఉపాధ్యాయురాలు మహమ్మద్ నాగు మీరా సయ్యద్ అబ్బాస్ ఈ పాఠశాలలో వీధుల్లోకి వచ్చిన కొత్తలో ఈ ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు మీ వంతు సహకారం అందించాలని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హెచ్ నరేంద్ర కుమార్ కోరారని అన్నారు వెంటనే ఆ ఉపాధ్యాయురాలు ఎండి నాగు మీరా మన ఇంటికి వెళ్లి తన పిల్లలు సానియా మరియు సల్మాన్ లతో కలిసి మనం ఆ పాఠశాలకు కొంత సహాయం చేయాలని చర్చించి ఆ ఉపాధ్యాయురాలు వెంటనే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేంద్ర కుమార్ కి నా వంతు సహకారం అందిస్తానని చెప్పిందని అన్నా వెంటనే విద్యార్థులు రాగి జావా పళ్లెంలో తాగుతున్న పరిస్థితి చూసి వారికి ఒక గ్లాస్ ఇవ్వాలని ఆలోచన వచ్చి పిల్లలకు ప్రతి ఒక్కరికి ఒక గ్లాసును అందించే కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు మరియు ఈ పాఠశాలకు పిల్లలను పంపుతున్న తల్లులకు ఒక చీరను కూడా ఉచితంగా అందించిందన తెలిపారు అంతేకాకుండా ఈ పాఠశాలల్లో ఉన్నటువంటి రికార్డులను భద్రపరిచేందుకు ఒక బీరువాను కూడా తనకు వచ్చేటువంటి వేతనంలో కెళ్ళ సొంత డబ్బులు వెచ్చించి ఈ వస్తువులను కొనుగోలు చేసి తీసుకొచ్చి ఆ పాఠశాలకు అప్పజెప్పిందని అన్నారు ఈ సందర్భంగా రంజాన్ మాసం పురస్కరించుకొని ఆమె భర్త ఆత్మ శాంతి చేకూరాలని ఈ కార్యక్రమాలను చేస్తున్నారని అన్నారు ఇంకా ఎన్నో కార్యక్రమాలను చేసిందని అన్నారు ఈమె చేస్తున్న సహాయ కార్యక్రమాల పట్ల గ్రామస్తులు ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆమెను శాలువతో ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చేశారని తెలిపాడు రానున్న రోజుల్లో కూడా విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం తన సొంత డబ్బులను వెచ్చించి వారి కావాల్సిన వస్తువులను అందిస్తామని ఈ సందర్భంగా తెలిపిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శశికళ రజిత ప్రతాప్ లతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు అంగన్వాడీ కార్యకర్తలు విద్యార్థులు ఆ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.