
కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. మండలంలోని మండలంలోని ఉప్పల్ వాయి సాంఘిక సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. రోజువారి కార్యక్రమాలు ఆటలు, చదువులు చదువు, భోజనాలు, ఏర్పాట్లపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని, 100% ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. తరగతి గదులు, మూత్రశాలలు, వంట గదులు, స్టోర్ రూమ్స్ పరిశీలించారు. వంటగదిలను ప్రతిరోజు శుభ్రం చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సంజయ్ కుమార్, ప్రిన్సిపాల్ శివరాం, జోనల్ అధికారి పూర్ణచందర్, తహసిల్దార్ సువర్ణ, ఎంపీడీవో తిరుపతిరెడ్డి, మండల విద్యాధికారి ఆనంద్ రావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.