విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలి: పూసల సుశాంత్

నవతెలంగాణ పెద్దవంగర: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకోవాలని దాత పూసల సుశాంత్ అన్నారు. తన తల్లి బొమ్మకల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పూసల శిరీష జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం పాఠశాల విద్యార్థులకు పాఠ్య సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. పేద విద్యార్థులకు తోడ్పాటు అందించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రణతి, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.