
భౌతిక శాస్త్రసిద్ధాంతాల ఆధారంగా రూపొందించిన వివిధ టెక్నాలజీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డి ఆర్ ఎల్ ఏ రిటైర్డ్ డైరెక్టర్ డాక్టర్ జి మధుసూదన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ చాప్టర్, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్రం విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం పీజీ ఆడిటోరియంలో నాన్ రెస్పెక్టివ్ ఎలుకేషన్ అండ్ టెక్నిక్స్ అనే అంశంపై ఒక రోజు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ జి మధుసూదన్ రెడ్డి హాజరై భౌతిక శాస్త్రం విద్యార్థులకు ఉపాధి అవకాశాల పై పలు సూచనలు చేశారు. పరిశ్రమలలో వారికి లభించే ఉద్యోగ అవకాశాలను వివరించారు. భౌతిక శాస్త్రం ఏ విధంగా విద్యార్థులకు అనుగుణంగా ఉంటుందో వక్తలు సవివరంగా ప్రయోగాత్మకంగా ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ విజ్జులత మాట్లాడుతూ.. తమ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తాము అభ్యసించే విద్య లో తగిన అవగాహన కల్పించేందుకు ఇలాంటి సదస్సులు ఎంతగానో దోహదపడతాయి. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సరస్వతమ్మ, ఏఎస్ఎల్ రి డైరెక్టర్ ఎం రామ మనోహర్ బాబు, ఎం యన్ వి. విశ్వనాథం, కే శ్రీనివాస్, భౌతిక శాస్త్రం టెక్నాలజీ హెచ్ ఓ డి నరేంద్రబాబు, అధ్యాపకులు డాక్టర్ రజినిమాలతి తోపాటు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.