నవతెలంగాణ – ఆర్మూర్
జార్జి రెడ్డి ఆశయాల దారిలో విద్యార్థులు నడవాలని సీపీఐఎంఎల్ ప్రజాపంథా, పిడిఎస్యు నాయకులు అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఐక్యత సంఘం పిడిఎస్యు ఏరియా కమిటీ జనరల్ కౌన్సిల్ నీ పట్టణంలోని లోని అల్ఫూర్స్ జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా ఏరియా అధ్యక్షులు జెండా ఆవిష్కరించి, కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తులుగా సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీ, సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, పార్టీ నాయకులు యు.రాజన్నలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమసమాజం కోసం, శాస్త్రీయ విధానం కోసం, ఈ సమాజంలో అసమానతలను ప్రశ్నించి ర్యాగింగ్ కు వ్యతిరేకంగా పోరాడిన కామ్రేడ్ జార్జి రెడ్డి, స్థాపించిన ప్రగతిశీల విద్యార్థి సంఘం పిడిఎస్యు అయిన ఎత్తిన బిగి పిడికిలి జెండాను, అనకమంది వీరులు చేతిన పట్టారు. వారి ఆశయ సాధనలో నడిచారు, అమరవీరుల అయ్యారు. మనకోసం ప్రాణాలు అర్పించిన ఆ వీరులను స్మరించుకోవాలని, విద్యార్థి హక్కులకై పోరాడాలని, సంఘం బాటలో నడవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి నిఖిల్, కోశాధికారి వినోద్, నాయకులు మమత, సాయి రాజు, రాజు, జంపన్న, తదితరులు పాల్గోన్నారు.