బయాలజికల్ టాలెంట్ టెస్ట్ లో విద్యార్థుల ప్రతిభ

నవతెలంగాణ – రామగిరి 
కమాన్ పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తెలంగాణ బయాలజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ ను మండల బాధ్యులు టి శంకర్, జి మల్లేష్  ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ టాలెంట్ టెస్ట్ లో మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల కమాన్ పూర్ జిల్లా పరిషత్ పాఠశాల రొంపి కుంట జిల్లా పరిషత్ పాఠశాల జూలపల్లి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ టాలెంట్ టెస్ట్ లో ప్రధమ నిలిచిన ఆర్ (శ్రీ వేణి  కమాన్ పూర్ పాఠశాల) ద్వితీయ స్థానంలో (వి వరుణ్ జిల్లా పరిషత్ పాఠశాల జూలపల్లి) లకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ,  అభివృద్ధికి మూలం సైన్స్ అని ఇటువంటి సైన్స్ టాలెంట్ టెస్ట్ ల ద్వారా పిల్లలకు సైన్స్ పట్ల అభిరుచిని కలిగించి సైన్స్ ప్రాముఖ్యతను తెలుసుకొనేలా మరియు నూతన ఆవిష్కరణలను కనుగొనేలా తయారు చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయురాలు సరళ, జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు పరిమళాదేవి, శిరోమణి, ఉపాధ్యాయులు ఈశ్వరరావు, సతీష్, నంబయ్య, మల్లేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.