నవతెలంగాణ – మద్నూర్
స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు మద్నూర్ మండలాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమం పట్ల ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు మండల కేంద్రంలోని బాలుర రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ర్యాలీగా పాఠశాలకు వెళ్లి పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ పరిసరాల పరిశుభ్రత పై తెలియజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఎమ్మెల్యే వెంటా మద్నూర్ మండలం ప్రత్యేక అధికారి జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ ఎంపీడీవో రాణి ఎంపీవో వెంకట నరసయ్య ఏపీఓ ఏపీఎం ఎంఈఓ రెసిడెన్షియల్ పాఠశాల ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.