టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

– పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ- జమ్మికుంట:
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 50 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలలో అబ్బాయిలకు  టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయంపై గతంలో పలుమార్లు విద్యాశాఖ అధికారులకు విన్నవించిన ఫలితం ఫలితం శూన్యమని ప్రధానోపాధ్యాయురాలు ఆరోపిస్తున్నారు. పాఠశాల ఆవరణంలో ఆవరణంలో టాయిలెట్స్ లేకపోవడంతో ఇంటర్వెల్ లో విద్యార్థులు, ఆ సాకుతో ఇంటికి వెళ్లి తిరిగి రావడం లేదని,  దీంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బయటకువెళ్లాలన్న రోడ్డు దాటాల్సి వస్తోందని  తెలిపారు. ఇప్పటికైనా విద్యాధికారులు, మున్సిపల్ అధికారులు స్పందించి విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, ఈ సమస్యను పరిష్కరించాలని ప్రధానోపాధ్యాయురాలు జంపాల పద్మ కోరారు.