పది పరీక్షల్లో ఇండియా మిషన్ సత్తా చాటిన విద్యార్థులు

నవతెలంగాణ – యాదాద్రి కలెక్టరేట్ 
భువనగిరి పట్టణంలోని ఇండియా మిషన్ హై స్కూల్ విద్యార్థులు  పదవ తరగతి ఫలితాల్లో  ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ఇండియా మిషన్ హై స్కూల్ కరస్పాండెంట్ రెవరెండ్ జుడా  తెలిపారు. 10 జీ.పీ.ఏ కి 9.8 ఇద్దరు వి అను, 9.8, బి జోష్ణశ్రీ 9.8 సాధించగా,  యాశీర్ జావిద్ 9.7 జి.పి.ఏ,  9 జిపిఏ కి 5 మంది విద్యార్థులు, 8 జీపీఏ కి 12 మంది విద్యార్థులు సాధించారు. ఐదునర ఎకరాల గల సువిశాలమైన ప్రాంగణంలో 30 సంవత్సరముల నుండి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు .ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత స్థితికి విద్యార్థులను చేకూర్చారు. విశాలమైన ఆట స్థలంలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఏకైక విద్యాసంస్థ ఇండియా మిషన్ హై స్కూల్. కరెస్పాండెంట్  తో పాటు ప్రిన్సిపాల్ జర్జ్ జోసెఫ్,  వైస్ ప్రిన్సిపాల్ ఎం అరుణకుమారి,  ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.