నవతెలంగాణ – ఆర్మూర్
తమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను తీర్చాలని శనివారం మండలంలోని మగ్గిడి గ్రామ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖలు రాసినారు. .పాఠశాలలో సమస్యలను, అవసరమైనటువంటి పరికరాల కోసం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పోస్ట్ కార్డు ద్వారా లెటర్ వ్రాయడం జరిగింది.. పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు ఉపాధ్యాయుల కొరత టాయిలెట్ల కొరత లాంటి సమస్యలను వివరిస్తూ విద్యార్థులు ముఖ్యమంత్రి ఉత్తరం రాయడం జరిగింది ..ఈ ఉత్తరాలన్నీ పోస్ట్ బాక్స్ లో వేయించినారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ హరిత, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.