
క్షేత్ర పర్యటనలో భాగంగా టిఎస్ఎన్ ఆర్ జెడ్పిహెచ్ఎస్ బిబిపేట బాలుర పాఠశాల విద్యార్థులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్న కుర్ల సిద్ధ రాములు పొలాన్ని గురువారం సందర్శించరు. పశువుల వ్యర్ధాలు, గృహాల నుంచి వచ్చే తడి పొడి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ జీవామృతం, పంచగవ్య వంటి సహజ ఎరువులను తయారు చేసే విధానం, ఇవి ఉపయోగించడం వల్ల అధిక దిగుబడులను పొందే విధానం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సిద్ధ రాములు మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం వల్ల పర్యావరణ విధ్వంసం జరిగి మనుషుల ఆరోగ్యం ఆయుషు తగ్గిపోతుందని కావున ప్రతి ఒక్కరూ సేంద్రీయ సాగు బాట పట్టి పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విశ్వ మోహన్, నాగరాజు, సంజీవులు పాల్గొన్నారు.