వన దర్శిని కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాంధారి విద్యార్థులను గాంధారి పరిధిలోని ఆటవి ప్రదేశము లోకి తీస్కెళ్ళి అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. ఫ్రోఫేసర్ హేమచందన ప్రతి విద్యార్థి పుట్టిన రోజు కి ఒక మొక్క నాటాలని కోరినారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. పాఠశాల విద్యార్థులకు పర్యావరణం ప్రాధాన్యత, అడవులను కాపాడాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో పరిచయం చేయాలన్న సంకల్పంతో తెలంగాణ అటవీశాఖ వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడి వివిధ రకాల చెట్లు, ఔషధ మొక్కలను పిల్లలకు అటవీ అధికారులు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాంధారి, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర గౌడ్ ఉపాధ్యాయులు బాల్ రెడ్డి,సాయిలు, శ్రీనివాస్, మన్సూర్, శరణ్య శంకర్ గౌడ్, చిరంజీవి మల్లేష్ విద్యార్థులు ఆటవి సిబ్బంది పాల్గొన్నారు.