
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
విద్యార్థులను ప్రోత్సహిస్తామని భారతరత్న కర్పూరి ఠాకూర్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కన్వీనర్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం భారతరత్న కర్పూరి ఠాకూర్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమాన్ టెక్డి లోని బీసీ సాధికారత భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో అసోసియేషన్ తీసుకునే నిర్ణయాలపై చర్చించామన్నారు. విద్యార్థుల కు చదువులలో ప్రోత్సహించడం, నాయి బ్రాహ్మణులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే గుర్తింపు వస్తుంది అన్నారు. భారతరత్న అవార్డు గ్రహీత కర్పూరి ఠాకూర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని త్వరలోనే కలిసి కోరుతామన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ జడ్జ్, లోహియా విచార్ మంచ్ అధ్యక్షులు టి గోపాల్ సింగ్ చేతులమీదుగా ఇటీవలే పదవి విరమణ పొందిన సుధాకర్ దంపతుల ను ప్రమోషన్ పొందిన ఏసిపి సురేష్ ను, వినోద్ కుమార్ , విద్యార్థులు సహిత లను మెమొంటో అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత ప్రభాకర్,అసోసియేషన్ ప్రతినిధులు మురళీమోహన్, లక్ష్మణ్ రావు, భవాని శంకర్, లక్ష్మీనారాయణ, వినోద్, జానయ్య, సంతోష్, సురేష్, నరహరి, దేవరకొండ నాగరాజు, వరంగల్ ఎఈ శ్రీనివాస్, ఘట్కేసర్ వనజ, వెంకటేష్, సిద్దిపేట్ కనకయ్య, శ్రీధర్ మురహరి, పెద్ద ఎత్తున ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.