విద్యార్థులకు నోట్ బుక్కులు బ్లాక్ బోర్డు అందజేత 

– ప్రతి విద్యార్థి ఉన్నంత ఎదగాలి 
– పెద్ద తండా గ్రామ నవ యువ భారతీ యూత్ నాయకుడు బాదావత్ సురేష్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని పెద్దతండ గ్రామపంచాయతీ పరిధిలోని ఉన్న ప్రభుత్వ పాఠశాల చదువుతున్న ప్రతి విద్యార్థికి నోటుబుక్కులు మరియు రెండు వైపులా వాడబడినల్ల బోర్డులను అందించినట్లు పెద్దతండ గ్రామ నవ యువ భారత్ యూత్ యువ నాయకుడు బాదావత్ సురేష్ తెలిపారు మండలంలోని  నెల్లికుదురు మండలంలోని పెద్దతండ (ఎమ్మార్పీ) గ్రామ పంచాయితీ పరిధిలో గల పెద్ద తండ. కొత్తూరు తండ. దూప తండ   ప్రాథమిక పాఠశాలలలో  చుదువుకుంటున్న  విద్యార్థిని, విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు  రెండు వైపులా వాడబడే నల్ల బోర్డ్ ఆయా పాఠశాల ఉపాధ్యాయుల చేతుల మీదుగా అందించే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీ పెద్ద తండా అభివృద్ధి చెందేందుకు నా వంతు సహకారం అందిస్తున్నారని అన్నారు గతంలో కూడా ఈ గ్రామ అభివృద్ధికి కొంత కృషి చేశారని తెలిపారు అందులో భాగంగా ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నంత స్థాయికి గ్రామాభివృద్ధి కి సహకరించాలని ఉద్దేశంతో నా సొంత ఖర్చులు సుమారు పదివేల రూపాయలు విలువ చేసే నోటుబుక్కులు నల్ల బొడ్డు అందిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు కన్న తల్లిదండ్రులకు పాఠాలు బోధించిన గురువులకు పూర్తి పెరిగిన ఊరుకు గుర్తింపు తెచ్చే విధంగా చదువుకోవాలని కోరినట్లు తెలిపారు రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అశోక్ చంద్రశేఖర్ రవికుమార్ మహేందర్ ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి కళ్యాణ్, నవ యువ భారత్ యూత్. బాదావత్ నవీన్, రమేష్, బాలకృష్ణ, రమేష్, వెంకన్న, మధుకర్, రమేష్, విజయ్, నవీన్, భరత్ మరియు తండా సభ్యులు పాల్గొన్నారు