కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

–  తాడ్వాయి కెనరా బ్యాంక్ మేనేజర్ సునీల్ కుమార్
–  విద్యార్థులకు చెక్కుల అందజేత
నవతెలంగాణ- తాడ్వాయి-
విద్యార్థులు కష్టపడి బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తాడ్వాయి కెనరా బ్యాంక్ మేనేజర్ లకావత్ సునీల్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలోని ఎస్టీ విద్యార్థినిలకు, అననీయ, ప్రణీత, మధుప్రియ, శాలిని, మీరాజాస్మిని, మమతాశ్రీ అనే మెరిట్ బాలికలకు ఆరుగురు విద్యార్థులకు కెనరా బ్యాంకు విద్యా జ్యోతి పథకం ద్వారా మంగళవారం 22,500 విలువగల స్కాలర్షిప్ లను బ్యాంకు మేనేజర్ లక్కావత్ సునీల్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రూప్ సింగ్, ఎస్జీటీ ఈసం బుచ్చయ్య, జోహార్, పాపారావు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.