పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణి..

Sending study material to tenth class students..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
చౌటుప్పల్ దివిస్ లాబరేటరీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ను జిల్లా కలెక్టర్ శనివారం పంపిణీ చేశారు. మాట్లాడుతూ.. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని 188 పాఠశాలల్లో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న 5944 మంది విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ వారి తరుపున ఉచిత స్టడీ మెటీరియల్  ను (హింది, తెలుగు, ఇంగ్లీషు) కరదీపికలను సంబంధిత ఉపాధ్యాయులచే తయారు చేసిన  “దీవీస్” లాబోరేటరీ, చౌటుప్పల్ వారి ఆర్థిక సౌజన్యంతో ముద్రించగా, కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా విద్యాశాఖాధికారి,సత్యనారాయణ  విద్యార్థులకు పంపిణి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ అన్ని ధానాలకన్నా విద్యాధానం గొప్పది అని, రానున్న 10వ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సమయం తక్కువగా ఉన్నందున కష్టపడి చదివి మంచి మార్కులు పొందాలని సూచించారు. గతంలో కూడా దీవిస్ లాబొరేటరీ వారు మన పాఠశాలలకు వాటర్ ప్లాంట్స్, సైన్స్ మెటీరియల్స్, స్టడీ మెటీరియల్  లను అందించారని తెలిపినారు. మున్ముందు కూడా ఇలాగే విద్యవ్యవస్థకి అవసరమైన సహయ సహాకారాలు అందించాలని ఆ యాజమన్యాన్ని కోరారు. వారిని శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దీవిస్ యాజమన్యం తరుపున కిషోర్ కుమార్,గోపి లు  కార్యాలయ సహాయ సంచాలకులు ప్రశాంత్ రెడ్డి, డి సి ఈ బి  సెక్రటరీ పాండు నాయక్ , ఏ సి జి ఈ  రఘురాంరెడ్డి , బుక్ డిపో మేనేజర్ రంగారాజన్ , ఎంఈఓలు నాగవర్ధన్ రెడ్డి, లక్ష్మీ గార్లు, సెక్టోరల్ అధికారులు జె.శ్రీనివాసులు, రాధ , లింగారెడ్డి , నరహరి  మరియు ప్రధానోపాధ్యాయులు. రమేష్ , కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.