స్టడీ మెటీరియల్ ను వినియోగించు కోవాలి

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్:

హుస్నాబాద్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్  సొంత ఖర్చులతో రెండు నెలల పాటు ఉచితంగా గ్రూప్ 2, 3, 4 , టి ఈ టి, డీఎస్సీ శిక్షణ  అందించి ఇచ్చిన  స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు.శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిరుద్యోగులకు మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న స్టడీ మెటీరియల్ ను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజక వర్గంలో  ఇప్పటివరకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ నిరుద్యోగుల కోసం ఉచితంగా 700 మందికి శిక్షణను అందించి స్టడీ మెటీరియల్ అందజేసినట్లు తెలిపారు. ఉచితంగా శిక్షణ తీసుకున్న 15 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అనిత రెడ్డి, కౌన్సిలర్ బొజ్జ హరీష్ తదితరులు పాల్గొన్నారు.