స్టైల్ పితార ఎగ్జిబిషన్ ఈనెల 16వ తేదీన ప్రారంభం…

– పోస్టర్ ఆవిష్కరణ
– ప్రతినిధులు రమారాఠి, వైశాలి 
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
మహిళలు తాము ఇండ్లలో స్వయంగా తయారు చేసే వస్తువులతో స్టైల్ పితార ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నట్లు క్రియేటిక్ ఆర్ట్స్ ప్రతినిధులు రమారాఠి, వైశాలి ఇనాని, వీనీతా బల్ద్వా, మీనల్ సార్ధాలు తెలిపారు. ఈ మేరకు శనివారం కోఠిలోని హస్మత్ గంజ్ లో ఏర్పాటు చేసిన  సమావేశంలో వారు ఎగ్జిబిషన్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16, 17వ తేదిలలో రెండు రోజుల పాటు రామ్ కోఠిలోని కచ్చిభవన్ లో క్రియేటివ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో స్టైల్ పితార ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. గృహిణులు ఇంట్లో తాము స్వయం కృషితో తయారు చేసిన గృహోపకరణ, పరికరాలు, దుస్తువులు, ఇంటీరియర్ వస్తువులు, జ్యువెలరీ, పుట్వేర్ తదితర వస్తువులతో 100 స్టాళ్ళతో ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రా ల నుండి మహిళలు తమ ఉత్పత్తులతో స్టాళ్ళు ఏర్పాటు చేసుకో నున్నట్లు వారు వివరించారు. ఈ ఎగ్జిబిషన్ లో వచ్చిన ఆదాయంలో కొంత భా గాన్ని ఏకల్ విద్యాలయ చారిటీకి తమవంతు సహాయాన్ని అందించేందుకు గాను నిర్ణయించడం జరిగిందని అన్నారు. దీంతో ఈ సహాయంతో విద్యార్థుల విద్య కోసం దోహద పడుతుందని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ ను భాగవతి మహేష్ బల్వా, జయశ్రీ బాహెతీలు ముఖ్య అతిధులుగా హాజరై ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారని వారు వివరించారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గం టల వరకు కొన సాగుతుందని అన్నారు. గత 16 సంవత్సరాలుగా మహిళా సాధికారతలో భాగంగా మహిళలు, గృహిణులు స్వయంగా ఎద గాలనే ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.