
డిచ్ పల్లి మండలంలోని సుద్ధపల్లి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కు చెందిన విద్యార్థిని శైలు హ్యాండ్ బాల్ జాతీయ స్థాయికి ఎంపికైందని పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ నళిని మంగళవారం తెలిపారు. గత నెలలో రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జనవరి 4 నుండి 9 వరకు పూర్ణ బీహార్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న 53వ సీనియర్ మహిళల జాతీయస్థాయి పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున ఆడనున్నట్లు తెలిపారు. ఎంపికైన సందర్భంగా నిజామాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష ,కార్యదర్శులు గంగా మోహన్ చక్రు, పింజ సురేందర్ ,పేట సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్, రెడ్డి పేట సంఘం ప్రధాన కార్యదర్శిగా మల్లేష్ గౌడ్ , ట్రెజరర్ రాజేష్, వైస్ ప్రిన్సిపల్ స్వప్న, వనిత, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జోష్ణ, పిఈటి శ్రీలత సాఫ్ట్బాల్ అకాడమీ కోచ్ మౌనిక విద్యార్థిని శైలుకు అభినందించారు.