బంగ్లాదేశ్‌తో వాణిజ్యం తగ్గొచ్చు : ఎస్‌అండ్‌పీ

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిణామాల వల్ల ఆ దేశంలో భారత వాణిజ్యం తగ్గొచ్చని ఎస్‌ అండ్‌ పీ పేర్కొంది. అయితే ఈ ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండకపోవచ్చని తెలిపింది. 2023-24లో బంగ్లాదేశ్‌కు భారత్‌ రూ.92వేల కోట్లు ఉత్పత్తులను ఎగుమతి చేసిందని పేర్కొంది. అంతక్రితం ఏడాది రూ.లక్ష కోట్లతో పోల్చితే కొంత తగ్గిందని పేర్కొంది.