
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ డోంగ్లి మండలాల్లో జరిగిన గ్రామసభల్లో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు. డోంగ్లి మండలం లోని మూగ గ్రామంలో జరిగిన గ్రామసభలో ఆ గ్రామ రైతులు సోయా పంట కొనుగోలు జరిపించాలని సబ్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మద్నూర్ మండలంలోని రూసేగావ్ గ్రామంలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. గ్రామస్తులు పలు సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఇరు గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ ఫలాలు అర్హులైన వారికి అందించడానికి గ్రామ సభలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ గ్రామ సభల్లో మండల అభివృద్ధి అధికారి రాణి మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్ డోంగ్లి తాసిల్దార్ రేణుక చౌహాన్ మండల పంచాయత్ అధికారి వెంకట నరసయ్య మండల ఏవో రాజు మద్నూర్ఎం ఎసి వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్ ఆయా గ్రామాల గ్రామ కార్యదర్శిలు వివిధ శాఖల అధికారులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.