ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి

నవతెలంగాణ – మద్నూర్ 
ఈ నెల 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల &  ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలోనీ ఉర్దూ మీడియం పాఠశాలలో ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి (ఐఏఎస్)  పరిశీలించారు. రెండు తరగతి గదులను పరిశీలించారు. ఒకటి పట్టభద్రుల ఓటర్ల కొరకు, మరోటి ఉపాధ్యాయ ఓటర్ల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. మండల పరిధిలో ధరఖాస్తు చేసుకున్న ఓటర్లు పట్టభద్రుల ఓటర్లు 417 మంది  ఉపాధ్యాయ ఓటర్లు 49 మంది  27న జరిగే పోలింగ్ రోజు ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అన్నారు. సబ్ కలెక్టర్  వెంట మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, ఎంపీవో వెంకట నర్సయ్య, గిర్ధవర్ ఎం శంకర్ తదితరులు పాల్గొన్నారు.