తల్లుల సన్నిధిలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

– మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో వన దేవతలను దర్శించుకున్న సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్
– అమ్మల దీవెనలు ప్రజలందరిపై ఉండాలి
– సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్
– వనదేవతలను దర్శించుకున్న మహబూబాబాద్(మానుకోట) సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్
నవతెలంగాణ -తాడ్వాయి 
మానుకోట సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ఆదివారం మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్నారు. పూజారులు ఎండోమెంట్ అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. మేడారం పరిసరాలను, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మానుకోట సబ్ రిజిస్టార్ తస్లీమా మహమ్మద్ మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రకృతిని ఆరాధ్య దైవంగా పూజించే ఈ జాతరకు కోట్లాది భక్తులు రావడం విశేషంగా ఉందని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్దనారు. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మల దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు.